అమెరికా న్యూజెర్సీలోని సాయిపరివార్ నూతన టెంపుల్ నిర్మాణానికి సర్వం సిద్ధంగా ఉన్నామని ఆలయ ట్రస్టీస్ సురేంద్ర కత్తుల, ముకుంద పారిక్, శ్రీధర్ చిల్లర, కమిటీ మెంబర్స్ శివ కొల్లి, అనిల్ బట్, తుషార్ పటేల్, వినయ్ నూగుర్, మోహన్ దేసిదే తెలిపారు. ప్రతి గురువారం నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకు చెందిన వందలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి బాబా ఆశీస్సులు తీసుకుంటున్నారని అన్నారు. దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించాలనుకుంటే సాయిపరివార్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.