Earthquake: నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం

రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో కంపించిన భూమి

Update: 2026-01-01 00:30 GMT

నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నెల 8వ తేదీన జపాన్ తూర్పు తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం విదితమే. ఆ సమయంలో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం డిసెంబర్ 12న 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఆ తుఫాను ధాటికి కనీసం 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. దాదాపు 90 వేల మంది ప్రజలను నిరాశ్రయులను చేసింది. 7.5 తీవ్రతతో సంభవించిన తుఫాను కారణంగా.. ఆ సమయంలో సుమారు 3 మీటర్ల ఎత్తున సునామీ అలలు రావచ్చని అక్కడి అధికారులు కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రభావిత దేశంగా జపాన్ నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాల్లో దాదాపు 20 శాతం జపాన్ పరిసరాల్లోనే సంభవిస్తుంటాయని వెల్లడైంది.

Tags:    

Similar News