ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన షేక్ సాబ్జీ
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు పాటుపడతానన్నారు షేక్ సాబ్జీ.;
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన షేక్ సాబ్జీకి రాజమహేంద్రవరంలో ఘన స్వాగతం లభించింది. కార్పొరేట్ శక్తులను ఓడించేందుకు 25 ఉపాధ్యాయ సంఘాలు తన గెలుపు కోసం కృషి చేశాయని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసే వరకు పోరాడతానన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసి, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు పాటుపడతానన్నారు షేక్ సాబ్జీ.