Venkaiah Naidu : షేక్ ఖలీఫా కు నివాళులు అర్పించిన భారత ఉపరాష్ట్రపతి..!
Venkaiah Naidu : యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున అబుధాబిలో నివాళులు అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.;
Venkaiah Naidu : యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున అబుధాబిలో నివాళులు అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. యూఏఈ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ను అబుధాబిలోని ముష్రిఫ్ ప్యాలెస్లో కలిసి సంతాపం తెలియజేశారు. అలాగే పదవి చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్-యూఏఈ మధ్య సత్సంబంధాలకు, యూఏఈ లోని భారతీయుల క్షేమానికి షేక్ ఖలీఫా చూపిన చొరవ మరువరానిదన్నారు. భారత్‌కు యూఏఈ ఎంతో సన్నిహిత మిత్రుడని ఖలీఫా తో ఆయనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. షేక్ మొహమ్మద్ నేతృత్వంలో భారత్-యూఏఈ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.