Video Viral: బీచ్‌కు వెళుతున్నారా జాగ్రత్త.. సముద్ర సింహాలు వెంటపడుతున్నాయ్..
Video Viral: సాయింత్రం పూట సరదాగా బీచ్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. ఇంతలో ఉన్నట్టుండి సముద్ర సింహాలు వారి మీదకు వచ్చాయి.;
Video Viral: సాయింత్రం పూట సరదాగా బీచ్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. ఇంతలో ఉన్నట్టుండి సముద్ర సింహాలు వారి మీదకు వచ్చాయి. అంతే ఒక్కసారిగా అందరూ భయపడి పరుగులు పెట్టారు. శాన్ డియోగోలోని లా జొల్లా ప్రాంతంలోని బీచ్‌లో సముద్ర సింహాలు సందర్శకులను భయపెట్టాయి.
సముద్ర సింహాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కావు.. కానీ అవి తమను తాము రక్షించుకునేందుకు మనుషుల మీదకు దూకుతుంటాయి.. సందర్శకులను గాయపరచిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, నిద్రపోతున్న సముద్ర సింహాలను ఒక మహిళ వీడియో తీస్తోంది. ఫోటోలను తీసేందుకు వాటికి దగ్గరగా వెళ్లింది.
దాంతో వాటికి మెలకువ వచ్చింది. అంతే ఆమెని వెంటపడడం ప్రారంభించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దగ్గర నుంచి లైక్‌లు, వ్యాఖ్యలతో పాటు దాదాపు 31.5K వీక్షణలను సంపాదించింది.
The sea lions at La Jolla Cove San Diego have had enough of the tourists. 😂 pic.twitter.com/N1UgY4Ez78
— Anthea (@Anthea06274890) July 10, 2022