WAR: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా

ఇరాన్‌ అణు ఆయుధ కేంద్రాలపై యూఎస్‌ దాడులు.. బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో విరుచుకుపడిన అగ్రరాజ్యం;

Update: 2025-06-23 05:30 GMT

ఇరా­న్‌-ఇజ్రా­యె­ల్‌ మధ్య ఉద్రి­క్త­త­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. ఇరు­దే­శా­లు మి­స్సై­ళ్ల­తో దా­డు­లు చే­సు­కుం­టు­న్నా­యి. ఇరా­న్‌­పై ము­ప్పేట దాడి మొ­ద­లైం­ది. పలు­మా­ర్లు ఇరా­న్‌­ను హె­చ్చ­రిం­చిన అమె­రి­కా.. ఇరా­న్‌­లో­ని అణు ఆయుధ కేం­ద్రా­ల­పై శని­వా­రం అర్ధ­రా­త్రి దా­డు­లు చే­సిం­ది. ఇరా­న్‌­లో­ని ఫో­ర్డో, నతాం­జ్‌, ఇస్ఫా­హ­న్ అణు­కేం­ద్రా­ల­పై అమె­రి­కా బీ-2 స్పి­రి­ట్‌ బాం­బ­ర్ల­తో వి­రు­చు­కు­ప­డిం­ది. ఫో­ర్డో­లో­ని భూ­గ­ర్భ అణు స్థా­వ­రా­న్ని ధ్వం­సం చే­సేం­దు­కు ఆరు బం­క­ర్ బస్ట­ర్ బాం­బు­లు వా­డిం­ది. నా­టాం­జ్, ఇస్ఫ­హా­న్‌­ల­పై దా­డి­కి 30 టొ­మా­హా­క్ క్షి­ప­ణు­ల ప్ర­యో­గిం­చిం­ది.

బీ-2 స్టెల్త్ బాంబర్ అంటే ఏంటి?

అమె­రి­కా వా­యు­సే­న­కు చెం­దిన బీ-2 స్టె­ల్త్ బాం­బ­ర్ ఓ ప్ర­త్యే­క­త­లు గల యు­ద్ధ వి­మా­నం. 1989లో తొ­లి­సా­రి­గా అమె­రి­కా ఈ బాం­బ­ర్‌­ను వా­డిం­ది. గత మూడు దశా­బ్దా­లు­గా అమె­రి­కా స్టె­ల్త్ సాం­కే­తి­క­త­కు ప్ర­తీ­క­గా ని­లు­స్తోం­ది. ఈ వి­మా­నం శత్రు­దే­శాల రా­డా­ర్ల­ను కని­పిం­చ­కుం­డా దా­డు­లు చే­య­డం దీని ప్ర­త్యే­కత. ఇప్ప­టి­కీ ప్ర­పం­చం­లో­ని అత్యంత సు­ర­క్షి­త­మైన వి­మా­నా­ల్లో ఇది ఒక­టి­గా ఉం­డ­టం వి­శే­షం. నా­ర్త్ర­ప్ గ్ర­మ్మ­న్‌ అనే అమె­రి­కా సం­స్థ దీ­న్ని అభి­వృ­ద్ధి చే­సిం­ది. ఇది భూ­గ­ర్భం­లో ఉన్న స్థా­వ­రా­ల­ను సైతం వి­జ­య­వం­తం­గా ధ్వం­సం చేసే సా­మ­ర్థ్యం ఉం­టుం­ది. దీ­ని­కి చాలా తక్కువ రా­డా­ర్‌ సి­గ్న­ల్‌ ఉం­టుం­ది. చి­న్న పక్షి మా­ది­రి­గా కని­పి­స్తుం­ది. 6వేల నా­టి­క­ల్ మై­ల్స్‌ దూరం ప్ర­యా­ణిం­చ­డం­తో పాటు దూరం ప్ర­యా­ణిం­చ­గ­ల­దు. శక్తి­వం­త­మైన ఆయు­ధా­ల­ను మూ­సు­కె­ళ్ల­గల సత్తా దీ­ని­కి ఉంది. ఆయు­ధా­ల­ను మో­సు­కె­ళ్ల­గ­ల­దు. ఇజ్రా­యె­ల్ ఇప్ప­టి­కే ఇరా­న్ అణు స్థా­వ­రా­ల­పై దా­డు­ల­కు పా­ల్ప­డిం­ది. అవి భూ­గ­ర్భం­లో ఉం­డ­డం­తో పె­ద్ద­గా నష్టం జర­గ­లే­దు. కానీ, భూ­గ­ర్భ ని­ర్మా­ణా­ల­ను ధ్వం­సం చే­య­గల సా­మ­ర్థ్యం ఇజ్రా­యె­ల్ వద్ద లేదు. ఇలాం­టి తరు­ణం­లో అమె­రి­కా రంగ ప్ర­వే­శం చే­సిం­ది. ప్ర­త్యే­కం­గా భూ­గ­ర్భ స్థా­వ­రాల కోసం రూ­పొం­దిం­చిన 30వేల పౌం­డ్ల మా­సి­వ్‌ ఓర్డి­నె­న్స్ పె­నె­ట్రే­ట­ర్ (బం­క­ర్ బస్ట­ర్ బాం­బు­లు) బీ-2 బాం­బ­ర్‌ ద్వా­రా ప్ర­యో­గిం­చిం­ది.బం­క­ర్ బస్ట­ర్లు భూ­గ­ర్భం­లో ఉన్న గు­హ­ల­ను, రహ­స్య స్థా­వ­రా­ల­ను లక్ష్యం­గా చే­సు­కు­నే శక్తి­వం­త­మైన బాం­బు­లు.

ఒక్కో బాంబు బరువు 13,600 కిలోలు

వాస్తవానికి ఇరాన్‌లోని ఫోర్డోపై 13,600కిలోల బరువుండే రెండు జీబీయూ-57 బంకర్‌ బస్టర్లు సరిపోతాయని అమెరికా భావించింది. కానీ ఈ ఆపరేషన్‌లో ఏకంగా ఆరు బాంబులను ప్రయోగించింది. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకొంటూ 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలతాయి. ఈ బాంబు బరువులో సుమారు 80 శాతం అత్యంత పటిష్ఠమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్‌ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో రెండు టన్నుల పైచిలుకు మాత్రమే విస్ఫోటకాలు ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు 20 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చింది.

చో­మా­హా­క్ క్షి­ప­ణు­లు కూడా...

నటాం­జ్, ఎస్ఫా­హా­న్‌­లో­ని మి­గ­తా రెం­డు అణు కేం­ద్రా­ల­పై 30 టో­మా­హా­క్ క్షి­ప­ణు­ల­ను అమె­రి­కా ప్ర­యో­గిం­చిం­ది. ఈ దా­డుల లక్ష్యం ఇరా­న్ అణు వి­ధా­నా­న్ని పూ­ర్తి­గా నా­శ­నం చే­య­డ­మే­న­ని ట్రం­ప్ స్ప­ష్టం చే­శా­రు. ఈ దా­డు­లు అమె­రి­కా సై­నిక సా­మ­ర్థ్యా­న్ని, స్టె­ల్త్ టె­క్నా­ల­జీ శక్తి­ని ప్ర­పం­చా­ని­కి చా­టా­య­ని ఆయన ప్ర­స్తా­విం­చా­రు. ఇరా­న్ అణు వ్య­వ­స్థ గత కొ­న్ని సం­వ­త్స­రా­లు­గా అం­త­ర్జా­తీయ సమా­జా­ని­కి ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. ఇరా­న్ అణు ఆయు­ధా­ల­ను తయా­రు చే­స్తోం­ద­నే ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. ఈ నే­ప­థ్యం­లో అమె­రి­కా, ఇజ్రా­యె­ల్ దే­శా­లు ఇరా­న్‌­పై ఒత్తి­డి తె­చ్చా­యి. ఈ దా­డు­లు ఇరా­న్ అణు సా­మ­ర్థ్యా­న్ని తగ్గిం­చ­డం­తో పాటు, మధ్య ప్రా­చ్యం­లో రా­జ­కీయ సమీ­క­ర­ణా­ల­ను మా­ర్చే అవ­కా­శం ఉంది. అమెరికా చర్యను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు.

Tags:    

Similar News