WEDDING: రూ.కోట్లు చెల్లించి.. యువతిని పెళ్లాడిన తాత

Update: 2025-10-20 05:30 GMT

టా­ర్మా­న్ అనే 74 ఏళ్ల వ్య­క్తి తన కంటే 50 సం­వ­త్స­రా­లు చి­న్న­దైన యు­వ­తి­ని పె­ళ్లా­డా­డు. ఈ పె­ళ్లి కోసం ఆ యు­వ­తి­కి ఆ వ్య­క్తి ఏకం­గా రూ.2 కో­ట్లు కన్యా­శు­ల్కం చె­ల్లిం­చా­డు. ఇం­డో­నే­సి­యా­లో లో జరి­గిన ఈ వి­వా­హం ప్ర­స్తు­తం చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. టా­ర్మా­న్‌ (74), అరి­కా(24)ల వి­వా­హం తూ­ర్పు జావా ప్రా­వి­న్స్‌­లో­ని పా­సి­ట­న్‌ రీ­జె­న్సీ­లో అక్టో­బ­రు 1న జరి­గిం­ది. ఈ వి­వా­హం చే­సు­కు­నేం­దు­కు గాను టా­ర్మా­న్‌ ఆ యు­వ­తి­కి దా­దా­పు రూ.2 కో­ట్లు చె­ల్లిం­చా­డు. అయి­తే ఫొ­టో­గ్రా­ఫ­ర్‌­ల­కు మా­త్రం డబ్బు­లు ఇవ్వ­కుం­డా తప్పిం­చు­కు­న్నా­రట. పె­ళ్లి అయిన తర్వాత తమకు ఇవ్వా­ల్సిన డబ్బు­లు చె­ల్లిం­చ­కుం­డా నవ­దం­ప­తు­లు అదృ­శ్య­మ­య్యా­ర­ని ఆ సం­స్థ ఆరో­పిం­చిం­ది. దీ­ని­పై పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు కూడా చే­సిం­ది. ఆ సం­స్థ తె­లి­పిన వి­వ­రాల ప్ర­కా­రం.. వధు­వు­కు తొ­లుత రూ.60లక్ష­లు ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. కానీ, వి­వాహ వే­డుక సమ­యం­లో ఏకం­గా రూ.1.8కో­ట్లు చె­ల్లిం­చా­రట. ఇక పె­ళ్లి­కి వచ్చిన అతి­థు­ల­కు కూడా కొంత డబ్బు­ను రి­ట­ర్న్‌ గి­ఫ్ట్‌­లు­గా ఇచ్చా­రు. ఈ వే­డు­క­లు ము­గి­సిన కొ­ద్ది­సే­ప­టి­కీ.. నవ దం­ప­తు­లు అదృ­శ్య­మ­య్యా­రు.

Tags:    

Similar News