గల్లంతైన టైటాన్ పైలెట్‌కు.. టైటానిక్‌కు సంబంధం
గల్లంతైన టైటాన్ జలాంతర్గామి పైలట్ గురించి ఆసక్తికర విషయం... టైటాన్ పైలెట్‌కు టైటానిక్ సంబంధం... విషాదం వెంటాడుతుందన్న కుటుంబం;
అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన టైటాన్ జలాంతర్గామి పైలట్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు గల్లంతైన టైటాన్ జలాంతర్గామి పైలట్‌కు... 1912లో టైటానిక్ మునిగిపోయినప్పుడు చనిపోయిన వారికి సంబంధం ఉన్న విషయం బహిర్గతమైంది. మినీ సబ్‌మెరైన్ టైటాన్ పైలెట్ స్టాక్‌టన్ రష్‌ను వెండీ రష్ వివాహం చేసుకున్నారు. వెండీ రష్.. టైటానిక్ నౌక మునిగిపోయినప్పుడు మరణించిన దంపతుల ముని మనవరాలు కావడం గమనార్హం. 1912లో టైటానిక్ నౌక మునిగిపో యినప్పుడు మరణించిన అమెరికా దంపతులు మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ అతడి భార్య ఇడా ముని మనవరాలే వెండి రష్ అని తెలిసింది. ఇప్పుడు తప్పిపోయిన జలాంతర్గామిలో వెండి రష్ భర్త స్టాక్‌టన్ రష్ కూడా ఉన్నాడు. స్టాక్‌టన్ క్షేమంగా ఇంటికి రావాలని ఆ కుటుంబం కోరుకుంటోంది. టైటానిక్ తమకు ఎప్పుడూ విషాదాన్నే మిగులుస్తుందని తలుచుకుని వెండిరష్ తల్లడిల్లిపోతున్నారు.