Wearing Jeans: తస్మాత్ జాగ్రత్త... ! జీన్స్ ధరించి ఆసుపత్రి పాలైంది
Wearing Jeans: కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ లలో తలదూర్చడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పని.. ఇందులో యంగ్ ఓల్డ్ అనే తేడా లేకుండా పోయింది..;
Wearing Jeans: కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ లలో తలదూర్చడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పని.. ఇందులో యంగ్ ఓల్డ్ అనే తేడా లేకుండా పోయింది.. ముఖ్యంగా దుస్తుల విషయంలో అయితే మరీనూ.. ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. జీన్స్ లో అయితే అమ్మాయిలతో పోటీ పడుతున్నారు బామ్మలు కూడా.. అయితే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించి ఆసుపత్రి పాలైంది.. ఐసీయూలో దాదాపుగా నాలుగు గంటల పాటు చికిత్స పొంది ఇంటికి చేరుకుంది. తనకి ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బిగుతుగా ఉండే జీన్స్ ధరించింది. అక్కడి నుంచి 8 గంటల తర్వాత ఇంటికి చేరుకున్న ఆమెకి మెల్లిగా నడుము నొప్పి మొదలైంది. ముందు లైట్ తీసుకుంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో డాక్టర్ ని సంప్రదించింది. ఆమెకి సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు వెల్లడించారు. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువైతే మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుందట.
ముందుగా అమె ఆసుపత్రిలో చేరిన పరిస్థితి ఏం మారలేదు.. ఆ తర్వాత వెంటనే ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి అక్కడ ఎనిమిది గంటల పాటు డీబ్రిడ్మెంట్ చికిత్సను అందించారు. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని ఆమె చెప్పుకొచ్చింది. దాదాపుగా మృత్యువుతో పోరాడి ఇంటికి చేరుకున్నానని తెలిపింది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది.