Topless to Protest : పుతిన్ ని వ్యతిరేకిస్తూ యువతులు టాప్‌లెస్‌గా నిరసన..!
Topless to Protest : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది.;
Topless to Protest : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. ఫ్రాన్స్ లోనూ ఆయన పైన వ్యతిరేక నినాదాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా మహిళలు ఈఫిల్ టవర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. టాప్‌లెస్‌గా ఉండి తమ దేహాలపైన యుద్ద వ్యతిరేక నినాదాలు రాసుకున్నారు.
ఉక్రెయిన్ జెండా కలర్లను ఒంటిపై పూసుకొని పుతిన్ కి వ్యతిరేకంగా 'స్టాప్ వార్ పుతిన్', 'ఫెమినిస్ట్స్ ఎగైనెస్ట్ వార్' వంటి నినాదాలు చేశారు. నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను 7 మార్చి 2022న టోమస్ మోరేల్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. యూరప్‌కు చెందిన మహిళలు టాప్‌లెస్‌గా తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఇలా చాలానే ఉన్నాయి. 2019లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక మహిళ కైవ్‌లోని పోలింగ్ స్టేషన్ వెలుపల తన నిరసన వ్యక్తం చేసింది.