Rare blue diamond: అరుదైన నీలి వజ్రం.. వేలం పాటలో రూ. 371 కోట్లకు..

Rare blue diamond: ఇది ఏప్రిల్ 2021లో దక్షిణాఫ్రికాలోని కుల్లినన్ గనిలో కనుగొనబడింది ఈ అరుదైన వజ్రం.

Update: 2022-04-29 12:00 GMT

Rare blue diamond: ది డి బీర్స్ బ్లూ అని కూడా పిలువబడే భారీ 15.10-క్యారెట్ స్టెప్-కట్ రత్నం, వేలంపాట నలుగురు కొనుగోలుదారుల మధ్య ఎనిమిది నిమిషాలపాటు నడిచింది. హాంకాంగ్‌లోని సోథెబీ వేలంలో అరుదైన నీలి వజ్రం $57.5 మిలియన్లకు (మన కరెన్సీలో రూ.371 కోట్లకు) విక్రయించబడింది.

ప్రపంచంలోనే అతి పెద్ద నీలి వజ్రం, ది బీర్స్ బ్లూ $57.5 మిలియన్లకు విక్రయించారు. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (GIA) ఈ ఆభరణాన్ని "ఫ్యాన్సీ వివిడ్ బ్లూ"గా వర్గీకరించింది.

10 క్యారెట్ల కంటే ఎక్కువ విలువైన రత్నాలు ఐదు మాత్రమే వేలంలో కనిపించాయి. ఏదీ 15 క్యారెట్‌లకు మించి లేదు, "ఈ దోషరహిత రత్నం యొక్క రూపాన్ని దానిలోనే ఒక మైలురాయిగా మార్చింది."

15 క్యారెట్ల కంటే ఎక్కువ ఉన్న నీలి వజ్రం ఇది మాత్రమే అని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇది ఏప్రిల్ 2021లో దక్షిణాఫ్రికాలోని కుల్లినన్ గనిలో కనుగొనబడింది ఈ అరుదైన వజ్రం. ఒపెన్‌హైమర్ బ్లూ కంటే ఈ వజ్రం పెద్దది. ఇది 14.62 క్యారెట్ లు ఉంది. 

Tags:    

Similar News