సీఎం జగన్ వస్తున్నాడంటే జనం వణికిపోతున్నారు

సీఎం జగన్ వస్తున్నాడంటే జనం వణికిపోతున్నారు

సీఎం జగన్ వస్తున్నాడంటే జనం వణికిపోతున్నారు. ఆయన అడుగు పెడుతున్నారంటే ఆందోళన చెందుతున్నారు.ఆయన వెళ్లే రూట్లో నీడనిచ్చే భారీ చెట్లను నరికేస్తున్నారు.షాపులు మూయిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే అప్రకటిత కర్ఫ్యూని విధిస్తారు. అంతే కాదు అడ్డం వచ్చినా రాకున్నా.. ప్రజల సొమ్ముతో నిర్మించిన వాటిని కూల్చేస్తారు, యుద్ధప్రాతిపదికన తొలగించేస్తారు. అవసరమైతే ప్రజలను కష్ట పెట్టైనా... సీఎం సారుని హ్యాపీ చేస్తున్నారు అధికారులు.

సీఎం జగన్ ఇవాళ్టి కర్నూలు జిల్లా ప్రత్తికొండ పర్యటనలోనూ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు అధికారులు. సీఎం కాన్వాయ్ వెళ్లే రూట్‌లో దుకాణాలు మూసివేయించారు. దీంతో ఉపాధి కోల్పోయామని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం వెళ్లే రూట్‌లోనే కాకుండా.. ఆయన వెళ్లని రూట్‌లోనూ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. చివరికి రైతు బజార్లను కూడా వదిలిపెట్టకుండా మూయించేశారు అధికారు. అవసరం లేకున్నా డివైడర్లను తొలగించారు. మరోవైపు సీఎం పర్యటనలో మీడియా పై ఆంక్షలు విధించారు.కెమెరా మెన్‌లను సమాచార శాఖ అధికారులు అనుమతించలేదు.దీంతో కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్ట్ ల నిరసనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story