ప్రభుత్వంపై వార్.. చావోరేవో తేల్చుకుంటామంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఏపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు యుద్ధం ప్రకటించారు. సమస్యల పరిష్కారంపై వెనక్కి తగ్గబోమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చావో రేవో తేల్చుకుంటామన్నారు. ఏపీ సీటీ సర్వీసెస్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలిసి నడుస్తామన్నారు. ఎన్ని నోటీసులిచ్చినా, కాగితాలిచ్చినా తీసుకుంటామన్నారు. కాగితాలతో ఆడుకుంటూనే 33 ఏళ్లు ప్రయాణించామన్నారు. వాటికి భయపడాల్సిన పనిలేదని ఎంతమందిని సస్పెండ్ చేసినా, ఎన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తమని వేరు చేయలేరన్నారు. సంఘటితంగానే ఉంటామని వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే 1500 మందిలో 13వందల మంది తమతోనే ఉన్నారని చెప్పారు. సమావేశానికిరాని వారిలోనూ 80శాతం వాటా తమదేనన్నారు. ఇక సమస్యల పరిష్కారానికి వచ్చేనెల రెండో వారం నుంచి దశలవారీ ఆందోళనలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com