ఒక్క ఛాన్స్‌ అని రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు: లోకేష్‌

ఒక్క ఛాన్స్‌ అని రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు: లోకేష్‌
జగన్‌ రెడ్డికి ఎవరూ గోల్డ్‌ మెడల్‌ ఇవ్వరని ఆయనే గోల్డ్‌ మెడల్‌ బ్రాండ్‌ తెచ్చారు

యువగళం పాదయాత్రలో భాగంగా యువనేత నారా లోకేష్ మదనపల్లి అన్నమయ్య నగర్‌లో నిర్వహించిన భహిరంగ సభలో మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అని అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శంచారు. ఒక్క ఛాన్స్‌ విధ్వంసానికి ఇచ్చినట్లైందన్నారు. మరో ఛాన్స్‌ ఈ ప్రభుత్వానికి ఇస్తామా అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో జాబ్స్‌ నిల్‌ గంజాయి ఫుల్‌ అన్నారు. వ్యతిరేకంగా మాట్లాడినందుకు సొంత పార్టీ నాయకులనే వేధించారు, జగన్‌ పాలనలో ఫిష్‌ ఆంధ్ర, మటన్‌ ఆంధ్ర, చికెన్‌ ఆంధ్ర వచ్చాయి. జగన్‌ రెడ్డికి ఎవరూ గోల్డ్‌ మెడల్‌ ఇవ్వరని ఆయనే గోల్డ్‌ మెడల్‌ బ్రాండ్‌ తెచ్చారు, సీఎం ఒక హామీ ఇస్తే దాని వెనక స్కామ్‌ ఉంటుందన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు ఇంతవరకు అకౌంట్లో పడలేదని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story