ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెండ్‌

ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెండ్‌
స్పీకర్‌ పోడియం వద్ద నిరసన

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లను సస్పెండ్‌ చేశారు స్పీకర్‌. దీనిపై స్పందించిన నిమ్మల నన్ను ఎందుకు సస్పెండ్‌ చేశారని ప్రశ్నించారు. ఉదయం నుంచి ఏమీ మాట్లాడలేదని, నా స్థానంలో నేను కూర్చొని ఉన్నానన్నారు. దీంతోపాటు స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వీరితోపాటు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని కూడా సస్పెండ్‌ చేశారు. అయితే వీరిని సభలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ తెలిపారు. సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని సస్పెన్షన్‌. బడ్జెట్‌ సెషన్‌ ముగిసే వరకు కోంటం రెడ్డి సస్పెన్షన్‌. పయ్యావుల, కోటంరెడ్డి, నిమ్మలను సెషన్‌ మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. మిగిలిన వారి సస్పెన్షన్‌ ఈ రోజుకు వరకు మాత్రమేనని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story