ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
క్లైమాక్స్‌కు చేరుకున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటును వినియోగించుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు మినహా అందరూ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఆయన కుమారుడి వివాహం కావడంతో ఇంకా అమరావతికి చేరుకోలేదు. అయితే ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి అమరావతికి వచ్చి ఓటు వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన ఓటును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వారి ఓట్లను నమోదు చేసుకున్నారు. అయితే ఎన్నిక ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story