వైసీపీ నుంచి ఆ నలుగురు సస్పెండ్‌

వైసీపీ నుంచి ఆ నలుగురు సస్పెండ్‌
క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆనం , మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు సస్పెండ్‌

వైసీపీలో అలజడి రేపుతున్న క్రాస్‌ ఓటింగ్‌ వ్యవహారంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గతంగా దర్యాప్తు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని సజ్జల తెలిపారు. ఒక్కొక్కరికి టీడీపీ అధినేత చంద్రబాబు 10 నుంచి 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్నారు. గతంలోను వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని కొన్నారని సజ్జల తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story