కడప జిల్లాలో దళిత డాక్టర్ అచ్చెన్న దారుణ హత్య

కడప జిల్లాలో దళిత డాక్టర్ అచ్చెన్న దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. పశు సంవర్ధకశాఖ డీడీగా పనిచేస్తున్న అచ్చెన్న మిస్సింగ్ కేసు చివరికి మర్డర్‌గా తేలింది. అచ్చెన్న కుటుంబం కర్నూల్లో ఉండగా.. ఆయన ఒక్కడే కడపలో విధులు నిర్వహిస్తున్నారు. దళిత అధికారుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని దళిత సంఘాల నేతలు వెల్లడించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటు టీడీపీ ఎస్సీ సెల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే సీఎం జగన్ సొంత జిల్లానే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. ఈ హత్యలో కొందరు సహోద్యోగులతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన రోజే ఆయన్ను చంపేసినట్లు తెలుస్తోంది. కిడ్నాపైనన 12 రోజుల తర్వాత అచ్చెన్న డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో దొరికింది. దళిత అధికారి దారుణ హత్యకు గురికావడం జిల్లాలో కలకలంరేపుతోంది. ఓ జిల్లా ఉన్నతాధికారి, దళిత వైద్యుడు కనిపించట్లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతదేహం లభించిన తరవాత.. ఆఘమేఘాలపై పోస్ట్ మార్టం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. అచ్చెన్న హత్యపై కుటుంబసభ్యులు జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com