టీడీపీలో కొత్త ఉత్సాహం తెలంగాణలో కూడా..

టీడీపీలో కొత్త ఉత్సాహం తెలంగాణలో కూడా..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడమే లక్ష్యంగా చర్చలు

టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో వచ్చిన ఉత్సాహాన్ని తెలంగాణలోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఏం చేయాలన్నదానిపై ప్లాన్ యాక్షన్ రెడీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయీలు తీసుకోనున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడమే లక్ష్యంగా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్దం చేయనుంది . తెలంగాణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. చాలా కాలం తరువాత హైదరాబాదులో పొలిట్ బ్యూరో మీటింగ్ జరగనుండడంతో ఏం చర్చిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story