ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన ఎంపీ అవినాష్‌

ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన ఎంపీ అవినాష్‌
సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారనే అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారనే అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు అవినాషశ్ రెడ్డి. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే అవినాశ్ ను సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ గత విచారణ సమయంలోనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలపై చర్చ జరిగింది. ఆ సమయంలో అవినాశ్ రెడ్డి కోర్టుకు వెళ్లగా, అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలివ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story