సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లింది అందుకేనా..బాబు వ్యాఖ్యలు అందుకు సంకేతమా

సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లింది అందుకేనా..బాబు వ్యాఖ్యలు అందుకు సంకేతమా
మంత్రివర్గంలో ముగ్గుర్ని చేర్చుకోవడం ఆ వ్యూహంలో భాగమేనా..? ఇవే చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లింది అందుకోసమేనా..? నవంబరులో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు ముందస్తుకు సంకేతమా..? అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆదిశగా సమాయత్తం అవుతున్నాయా..? తెలంగాణతోపాటు ఏపీకి కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా..? ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్‌ మంత్రివర్గ ప్రక్షాళన చేస్తున్నారా..? మంత్రివర్గంలో ముగ్గుర్ని చేర్చుకోవడం ఆ వ్యూహంలో భాగమేనా..? ఇవే చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.. వసరు పరిణామాలను అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి..

అటు ఏపీ కేబినెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై జగన్‌ కసరత్తు పూర్తిచేసినట్లుగా సమాచారం.. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రానున్నట్లు తెలుస్తోంది.. కొడాలి నానితోపాటు బాలినేని శ్రీనివాసరెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రసన్న కుమార్‌ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది.. మరికొన్ని మార్పులపైనా సీఎంవో కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేబినెట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గవర్నర్‌తో జగన్‌ భేటీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. తెలంగాణ ఎన్నికలతోపాటు ఏపీలోనూ సార్వత్రిక సమరం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. దీంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story