సత్యకుమార్‌పై దాడి వైసీపీ పనే: బోండా ఉమా

సత్యకుమార్‌పై దాడి వైసీపీ పనే: బోండా ఉమా

బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి వైసీపీ పనే అని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర పరిస్థితిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక దేశంలో అద్భుత నగరం అమరావతి అని.. అలాంటి అమరావతిని నీరుగార్చారని మండిపడ్డారు. 98శాతం హామీలు ఎక్కడ నెరవేర్చాలో నిరూపించాలని..15లక్షల మందికి పెన్షన్లు ఎగొట్టారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 57వేల కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. చివరికి ఉద్యోగుల డబ్బులు కూడా జగన్ లూటీ చేశారన్నారు. ఇక ఢిల్లీలో పైరవీలు చేయడానికే వైసీపీ ఎంపీలు ఉన్నారని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story