బాబు సరికొత్త విజన్.. పేదవాడిని ధనకుడిగా మార్చేందుకు ప్రణాళికలు

టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త విజన్ తో ముందుకు వస్తున్నారు. టీడీపీ 41వ ఆవిర్భావం రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడిని ధనకుడిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో విజన్ 2020 అంటే తనను ఎగతాళి చేశారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడా విజన్ 2020 ఎలా అమలవుతోందో మీకే అర్థమవుతోందని చెప్పారు. ఇప్పుడందరూ తన విజన్‌ను పొగుడుతున్నారని.. ఇప్పుడు రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా దివాలా తీయించిందని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వచ్చి ఏం చేస్తారు అని అనుకోవచ్చని.. 1995లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. సంస్కరణలతో అభివృద్ధి సాధించి చూపించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా సంస్కరణలతో ప్రతీ పేదవాడినికి ధనకుడిగా చేసే వరకూ విశ్రమించబోమని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com