శింగనమలలో ప్రొఫెషనల్స్‌తో లోకేష్ సమావేశం

టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఏపీని అభివృద్ధి చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తరలిపోయిన పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తాం.. యువతకు మళ్లీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. శింగనమల నియోజకవర్గం జంబులదిన్నెలో ప్రొఫెషనల్స్‌తో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ ఉద్యోగులు, వివిధ రంగా ప్రొఫెషనల్స్ హాజరై తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను ఆసాంతం విన్న యువనేత.. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు అనేక అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చారని లోకేష్ గుర్తుచేశారు. ఒక్క కియా పరిశ్రమ వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా తలసరి ఆదాయం 30 వేల రూపాయలు పెరిగిందన్నారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమకు చంద్రబాబే శంకుస్థాపన చేసారన్న లోకేష్.. అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కంపెనీలు ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో జగన్ ఏపీని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తతారు. జగన్ పాలనతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయని విమర్శించారు. ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేక.. యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని లోకేష్ ఆరోపించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com