చిరిగిన చొక్కాతోనే కొమ్మాలపాటి అరెస్ట్

X
By - Subba Reddy |9 April 2023 12:00 PM IST
అమరలింగేశ్వర ఆలయం వద్దకు వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకొమ్మాలపాటి శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అమరలింగేశ్వర ఆలయం వద్దకు వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకొమ్మాలపాటి శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీధర్‌తో పాటు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీధర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు,టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం,తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.అయితే పోలీసులతో జరిగిన పెనుగలాటలో కొమ్మాలపాటి శ్రీధర్ చొక్కా చినిగిపోయింది. నేను ప్రజల కోసం వచ్చానని ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు శ్రీధర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com