జగన్ వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటున్నాడు : సునీల్‌ దేవధర్‌

జగన్ వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటున్నాడు : సునీల్‌ దేవధర్‌

ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్ వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటున్నాడని.. ఏడుకొండల వాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదంటూ తీవ్ర విమర్వలు చేశారు.. ఫ్యాక్షన్‌ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు.. జగన్‌ ఏపీకి ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు.. తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదన్నారు.. వివేకా కేసులో అదే జరుగుతోందని సునీల్‌ దేవధర్‌ అన్నారు.. జగన్‌ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు.. టీటీడీలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని సునీల్ దేవధర్‌ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story