AP : అమరావతి రాజధాని ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం

AP : అమరావతి రాజధాని ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం

అమరావతి రాజధాని ప్రాంతంలో టెన్షన్‌ నెలకొంది. పేదలందరికీ ఇల్లులో భాగంగా సెంటు భూమి చొప్పున ఇచ్చేందుకు సీఆర్డీఏ రంగం సిద్ధం చేస్తోంది. సీఆర్డీఏ చర్యను అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య హైకోర్టులో వున్నందున సీఆర్డిఏ చర్య కోర్టు ధిక్కారని రైతులు ఆరోపిస్తున్నారు. కృష్ణయ్య పాలెం సమీపంలో ప్రొక్లయినర్స్‌తో కంపను సీఆర్‌డీఏ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొక్లయిన్‌ పనులు చేయడం పై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని ప్రాంతంలోని ఆర్‌5 జోన్‌లో జరుగుతున్న జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను రైతులు అడ్డుకున్నారు. కృష్ణ-గుంటూరు జిల్లాల్లోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇచ్చేందుకు సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన కృష్ణయ్యపాలెం చేరుకున్నారు. జంగిల్ క్లియరెన్స్‌ పనులను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story