Nara Lokesh : జనసునామీలా ఆదోనీలో యువగళం

Nara Lokesh : జనసునామీలా ఆదోనీలో యువగళం

ఏపీలో యువగళం ప్రభంజనం కొనసాగుతుంది. ఆదోని నియోజకవర్గంలో యువనేత పాదయాత్ర జనసునామీని తలపిస్తోంది. లోకేష్‌కు అడుగడుగునా జననీరాజనం అందుతుంది. ప్రతి గ్రామంలో మంగళహారతులతో లోకేష్‌కు మహిళలు స్వాగతం పలుకుతున్నారు. యువనేత వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్‌.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఆదోని నియోజకవర్గంలో 77వ రోజు విజయవంతంగా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకులోకి లోకేష్‌ వెళ్లారు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంక్‌ వద్దే సెల్ఫీ తీసుకున్నారు. ఇక లోకేష్ సెల్ఫీలు తీసుకునే సమయంలో జనం ఎగబడ్డారు. ధరల పెంపుకు నిరసనగా సామాన్యులు సైతం లోకేష్‌తో కలిసి పెట్రోల్ బంక్‌లో సెల్ఫీలు దిగారు. ఇక దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజీల్‌పై ఏపీ సర్కార్‌ వసూలు చేస్తోందని లోకేష్ ఆరోపించారు. సామాన్య ప్రజలను జగన్‌ అనునిత్యం దోచుకుంటున్నారని మండిపడ్డారు.

స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలు వారి సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ పాలనలో ధరల పెరుగుదలతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమ వర్గీయులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని లోకేష్‌ భరోసా ఇచ్చారు. టీడీపీ హయాంలో ముస్లింలు గౌరవంగా బతికారని.. జగన్ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై వేధింపులు పెరిగాయని మండిపడ్డారు.

సాయంత్రానికి యువగళం పాదయాత్ర మరోమైలురాయి చేరుకోనుంది. యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్న లోకేష్.. వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అందుకోనున్నారు. ఆదోని సిరిగుప్ప క్రాస్‌ వద్ద దీనికి సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించనున్నారు లోకేష్‌. అనంతరం ఆదోని కడికొత్త క్రాస్‌ వద్ద బహిరంగ సభలో పాల్గొనున్నారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్రగా విడిది కేంద్రానికి వెళ్లనున్నారు.

Tags

Next Story