AP : టీడీపీ సెల్ఫీ వీడియోలతో వైసీపీ ప్రభుత్వానికి ఎసరు

AP : టీడీపీ సెల్ఫీ వీడియోలతో వైసీపీ ప్రభుత్వానికి ఎసరు
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు సెల్ఫీ వీడియోల టైమ్‌ నడుస్తోంది. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా టీడీపీ నాయకులు సెల్ఫీ వీడియోల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. దీంతో అవి బాగా వైరల్‌ అవుతున్నాయి. చెప్పాల్సింది సెల్ఫీ వీడియోల ద్వారా చెప్పేస్తుండటంతో ప్రజలకు ఈజీగా చేరువవుతున్నాయి. ఈ సెల్ఫీ వీడియోలకు నాంది పలికింది మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

యువగళం పాదయాత్ర చేపట్టిన నాటి నుండి వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలను.. ప్రభుత్వాలు మధ్యలో ఆపేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ, వీడియోల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో లోకేష్ విజయవంతమయ్యారు. అదే బాటలో ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు అడుగులు వేస్తున్నారు. రోజుకో సెల్ఫీ వీడియో ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రజలు దృష్టికి తెస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఛాలెంజ్‌ చేశారు. అందుకు అనుగుణంగానే రోజుకో వీడియోను విడుదల చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెమటలు పట్టిస్తున్నారు.

మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత సైతం పేరూరు డ్యామ్‌కు సంబంధించిన సెల్ఫీ ఫోటోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసాయి. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు మారుతి చౌదరి, ఉమామహేశ్వర్ నాయుడు ఇలా ఒక్కొక్కరుగా సెల్ఫీ వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. ప్రజా సమస్యలను పౌరుల దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతం అవుతున్నారు. కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజల వద్దకు చేరువయ్యేందుకు టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది.

Tags

Next Story