అక్రమంగా రంగురాళ్లు తవ్వేస్తున్నారు.. జగన్ సర్కారుపై మండిపడ్డ అయ్యన్న

అక్రమంగా రంగురాళ్లు తవ్వేస్తున్నారు.. జగన్ సర్కారుపై మండిపడ్డ అయ్యన్న
జగన్ సర్కారుపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు

జగన్ సర్కారుపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సాలిక మల్లవరంలో.. అక్రమంగా రంగురాళ్లు తవ్వేస్తున్నారని ఆరోపించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గణేష్ అండతోనే రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ నేతలు 2 జేసీబీలు, ట్రాక్టర్లతో రూ.15 కోట్ల విలువైన రంగురాళ్లు తవ్వుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే లోకేష్ హస్తం ఉందని నిరూపించంచాలని సవాల్ విసిరారు. రంగురాళ్ల తవ్వకాల్లో వాస్తవాలు కచ్చితంగా బయటకు రావాలని.. లేకుంటే సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌ వరకు వెళ్తామని స్పష్టంచేశారు. రంగురాళ్ల తవ్వకాల్లో అధికారుల హస్తం కూడా ఉందని.. తక్షణమే అధికారుల ఫోన్లు సీజ్ చేసి విచారణ చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story