తాడిపత్రిలో హైటెన్షన్..జేసీని ఈడ్చుకెళ్లిన పోలీసులు

తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. ఇసుక అక్రమ రవాణాపై దండయాత్ర ప్రకటించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. మీడియాతో మాట్లాడుతుండగానే.. పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. మీడియా ప్రతినిధులను ఎవరినీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి అనుమతించడం లేదు.
తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే.. వాహనాలను కాల్చివేస్తానంటూ గతంలోనే జేసీ డెడ్ లైన్ విధించారు. ఆ డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మీడియా ప్రతినిధులు కూడా పోలీసులు జేసీ నివాసం వద్దకి వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడే ఉంటే మీడియా ప్రతినిధులపైనా చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు.
యువ గళం పాదయాత్రలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక అక్రమ రవాణాపై నారా లోకేష్ ప్రశ్నించారు. పెద్ద పప్పూరులోని పెన్నా నది ఇసుక రీచ్‌లో సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. పాదయాత్ర తరువాత ఇసుక అక్రమ రవణాపై తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com