తాడిపత్రి మున్సిపల్‌ ఆఫీస్ ఎదుట టీడీపీ వంటావార్పు

తాడిపత్రి మున్సిపల్‌ ఆఫీస్ ఎదుట టీడీపీ వంటావార్పు
తాడిపత్రిలో మున్సిపల్‌ కమిషనర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నిరసన చేపట్టింది

తాడిపత్రిలో మున్సిపల్‌ కమిషనర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నిరసన చేపట్టింది. ఆయన నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మున్సిపల్‌ ఆఫీస్ ఎదుట టీడీపీ వంటావార్పు నిర్వహించింది. కమిషనర్‌ మున్సిపల్‌ యాక్ట్ 1965 రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ మీటింగ్‌ ఏర్పాటు చేయడం లేదని,మున్సిపాలిటికి నష్టం కలిగించేలా కమిషనర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 14లక్షల విలువైన టైర్లు మాయమైన కనీసం పట్టించుకోలేదని పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ నిర్వహణకు కూడా నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు టీడీపీ కౌన్సలర్‌లు.

Tags

Next Story