సీఎం జగన్ హంద్రీనీవా మాటే మరిచారు: కాల్వ శ్రీనివాసులు

వైసీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా కెనాల్ పట్ల నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి.. టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజక వర్గంలోని కసాపురం వద్ద.. హంద్రీనీవ కెనాల్‌ను పరిశీలించారు. హంద్రీనీవా కెనాల్ సామర్ధ్యాన్ని 6వేల క్యూసెక్కులకు పెంచుతామన్న.. జగన్ మాట ఏమైందని శ్రీనివాసులు ప్రశ్నించారు. జిల్లా మనవడిని అని చెప్పి జగన్ మాట తప్పారని మండిపడ్డారు. ఇటీవల యువగళం పాదయాత్రలో హంద్రీ నీవా కెనాల్ సమస్యలపై లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. టీడీపీ హయాంలో 11వందల కోట్లతో హంద్రీనీవా కెనాల్ వెడల్పు కోసం టెండర్లు పిలవగా.. వాటిని ఆపేసిన వైసీపీ సర్కార్ కొత్తగా పనులు ప్రారంభిస్తామని తెలిపింది. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com