తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి : ఏపీ టీచర్స్‌ జేఏసీ

తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి : ఏపీ టీచర్స్‌ జేఏసీ
X

తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి.. పాంప్లెట్లను ఆవిష్కరించింది ఏపీ టీచర్స్‌ జేఏసీ. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలన్నింటిని కలుపుకొని ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు యూటీఎఫ్ చైర్మన్ వెంకటేశ్వర్లు. టీచర్లు స్కూల్‌ కెళ్లాక పిల్లలకు చిక్కీలు,కోడిగుడ్లు ఎంత సైజు ఉన్నాయి. పిల్లలు తిన్నారా లేదా అన్న ఫోటోలు పెట్టాలన్న నియమంపై మండిపడ్డారు. యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే చర్యలు తీసుకుంటున్నారని,ప్రవీణ్ ప్రకాష్ టీచర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎంఈఓ పోస్టుల్లో భారీగా ఖాళీగా ఉన్నాయని, ఒక్కొక్క ఎంఈఓ 3 మండలాల్లో పనిచేయాల్సి వస్తుందన్నారు. పర్యవేక్షణ అంటే టీచర్లను భయభ్రాంతులకు గురి చేయడం కాదని ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని రెండు నెలలు ఉపాధ్యాయుల వృత్తి చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ముందు టీచర్లను కించపరుస్తున్నారని మండిపడ్డారు ఏపీ టీచర్స్‌ జేఏసీ నేతలు

Tags

Next Story