TDP : జగన్‌ పాలనా తీరుపై లోకేష్‌ ట్వీట్‌

TDP : జగన్‌ పాలనా తీరుపై లోకేష్‌ ట్వీట్‌
X

సీఎం జగన్‌ పాలన తీరుపై టీడీపీ యువనేత నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. సీమ ప్రజలకు గుక్కెడు త్రాగునీరు ఇవ్వడం చేతగాని వైసీపీ ప్రభుత్వానికి.. పథకాలకు మాత్రం సిగ్గులేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత ప్రభుత్వం మినరల్ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ పథకానికి నీరు అందించడం చేతగాక.. మళ్లీ జలగన్న స్టిక్కర్‌ మాత్రం వేసుకోవడం ఏంటోనని లోకేష్‌ ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడం అలవాటుగా మారిన సైకో బ్యాచ్‌.. ఖాళీ ఖజనాతో చేయగలిగింది ఏముందంటూ క్వశ్చన్ చేశారు. ఇంతకు మించి తాము ఏం చేయలేమని పరోక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ నేతలు వారి మొఖాలకు స్టిక్కర్లు వేసుకుంటే బాగుండేదేమోనని లోకేష్ చురుకలంటించారు.

Tags

Next Story