చంద్రబాబు ఒక దీర్ఘదర్శి: రజినికాంత్

టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే ఒక విజన్. ఇది ఎన్నో సార్లు చంద్రబాబు నిరూపించారు. ఆయన చేసిన పనులు ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచాయి. దేశ విదేశాల ప్రముఖులు సైతం చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్ని ఆయన చేసిన విజనరీ వల్లే సాధ్యమయ్యాయి. దృఢమైన సంకల్పంతో భవిష్యత్తును ఆలోచించి యువతకు బంగారు బాట వేయటంలో చంద్రబాబుకు మరెవరు సాటిరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న రోజుల్లో చంద్రబాబు తీసుకొచ్చిన కార్యక్రమాలు నేడు గొప్పగా నిలిచాయి. ఇక మరోసారి చంద్రబాబు విజన్ గురించి నటుడు రజినీకాంత్ వివరించారు.
చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్ నగరాన్ని తలపించేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని నటుడు రజనీకాంత్ కొనియాడారు. ఇప్పుడు లక్షల మంది తెలుగువారు దేశవిదేశాల్లో ఐటీ రంగంలో పనిచేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారంటే చంద్రబాబే కారణమని ప్రశంసించారు. చంద్రబాబు రూపొందించిన విజన్ 2047 ఒక అద్భుతమని, అది అమలైతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. ఆయన ప్రణాళికలు అమలు కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
చంద్రబాబుకు 24 గంటలూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే ఉందన్నారు. దేశ రాజకీయాలే కాదు, అంతర్జాతీయ రాజకీయాలూ తెలుసని.. ఆయన ఒక విజనరీ అన్నారు. ఇది తాను చెప్పేది కాదని.. చంద్రబాబు ఘనత, ప్రతిభ గురించి దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసన్నారు. ఇక్కడున్న వారి కంటే బయటి వారికే చంద్రబాబు గొప్పతనం తెలుస్తుందన్నారు. ‘1996-97లోనే చంద్రబాబు విజన్ 2020 అని చెప్పారని గుర్తు చేశారు. ఐటీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో అంచనా వేశారని అన్నారు. చంద్రబాబు చెప్పిన డిజిటల్ వరల్డ్‌ను అప్పుడు ఎవరూ ఊహించలేదని... తర్వాత హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారని గుర్తు చేశారు. బిల్‌గేట్స్ లాంటి దిగ్గజాలు వచ్చి ఇక్కడ కంపెనీలు ప్రారంభించారని చెప్పారు రజినీకాంత్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com