ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న సీఐడి

రాజమహేంద్రవరంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులను ఏపీ సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను రాజమహేంద్రవరం సీఐడి కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. చిట్‌ఫండ్ వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులను సీఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఐడీ కార్యాలయానికి మాజీ మంత్రి జవహర్ సహా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. అటు టీడీపీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెళ్లారు. దాంతో సీఐడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ అవినాష్‌రెడ్డి అరెస్ట్ తథ్యమని తెలిసి.. జనం దృష్టి మళ్లించేందుకు సీఐడి కుట్ర పన్నిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గల్లీ ట్రిక్స్‌కు ప్రజలు మోసపోరన్న విషయాన్ని.. తాడేపల్లి సైకో గ్రహించాలని పట్టాభి అన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై జనం చర్చించుకోకుండా.. ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యుల అరెస్ట్‌పై చర్చించుకునేలా చేయాలన్నది సీఐడి ప్లాన్ అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com