రజనీకాంత్‌పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు

హీరో రజనీకాంత్‌పై వైసీపీ నేత విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. విజయవాడ పర్యటనలో జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నేతలు చేసిన నీచపు వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఎన్టీఆర్ శతజయంతి కార్కక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. తన అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర దాడిని ఖండిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
సమాజంలో ఎంతో గౌరవంగా ఉండే రజనీకాంత్ లాంటి లెజండరీ పర్సనాలిటీపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అందరికీ బాధ కలిగిస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై రజనీకాంత్ చిన్న విమర్శకూడా చేయలేదన్న చంద్రబాబు... పలు అంశాలపై తన అభిప్రాయాలు మాత్రమే పంచుకున్నారని చెప్పారు. అయినా తీవ్ర అహంకారంతో రజనీకాంత్‌పై చేస్తున్న అర్ధంలేని విమర్శళను తెలుగు ప్రజలు ఎవరూ సహించబోరని అన్నారు. శిఖరం లాంటి వ్యక్తితం కలిగిన రజనీకాంత్ కేరక్టర్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మివేయడమేనన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలన్న చంద్రబాబు.. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలన్నారు.
అటు రజనీకాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు. రజనీకాంత్‌కు వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై తిట్టిపోస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అపాలజీ రజని హ్యాష్ ట్యాగ్‌తో కామెంట్స్ పెడుతూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. కొన్ని క్షణాల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com