AP : జగన్ క్రూరత్వానికి బలికావాలా : సర్పంచ్‌లు

AP : జగన్ క్రూరత్వానికి బలికావాలా : సర్పంచ్‌లు
X

ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గుంటూరులో సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్‌ సాక్షిగా అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. ఇకనైనా మా నిధులు మాకివ్వండి.. మా విధులు మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నాలుగేళ్లుగా జీతాలు ఇవ్వకపోవడంతో.. వారు విధులు మానేసి వెళ్లిపోయారని తెలిపారు. శుభ్రం చేసే వారు లేక గ్రామాలు అపరిశుభ్రంగా మారాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ క్రూరత్వానికి తాము బలికావాలా సర్పంచ్‌లు ప్రశ్నించారు.

Tags

Next Story