AP : రైతుల పంట నష్టం.. సర్కార్‌పై చంద్రబాబు సమరభేరి

AP : రైతుల పంట నష్టం.. సర్కార్‌పై చంద్రబాబు సమరభేరి
X

తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని కల్లారా చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. సర్కార్‌పై సమరభేరి మోగిస్తున్నారు. 72 గంటల్లో ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఎవరూ పారబోయవద్దని రైతులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే మనమే సీఎం జగన్‌ నివాసం తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకెళ్దామన్నారు. సీఎం జగన్ ఇంటి ముందు ఈ ధాన్యం తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. అటు.. పంట నష్టంతో రైతులు ఆందోళనతో ఉన్నా అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగంలో చంద్రబాబు రాక కదలిక తెచ్చింది. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వారి హడావుడి మొదలయ్యింది. తడిచిన దాన్యాన్ని యుద్ధప్రాతిపదిక తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల్ని మభ్యపెట్టి ధాన్యాన్ని తరలించేస్తున్నారు.

Tags

Next Story