దళితుల ద్రోహి జగన్‌ రెడ్డి రా.. పాట విడుదల

దళితుల ద్రోహి జగన్‌ రెడ్డి రా.. పాట విడుదల
ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి దళిత ద్రోహి అంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు విరుచుకుపడ్డారు

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి దళిత ద్రోహి అంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు విరుచుకుపడ్డారు. దళితుల ద్రోహి జగన్‌ రెడ్డి రా.. అనే పాటల సీడీని ఆయన విడుదల చేశారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై తిరగబడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. దళితులంటే జగన్ రెడ్డికి చులకన భావం ఎక్కువనీ.. అందుకే దళిత సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దళితులు మేనమామలంటూ వంచించి.. నిలువునా ముంచాడని మండిపడ్డారు. జగన్ పాలనలో దళితులు బ్రతకడం కష్టమని నక్కా ఆనంద్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story