అప్పారావు, వాసు విడుదల..హారతులు ఇచ్చి స్వాగతం

అప్పారావు, వాసు విడుదల..హారతులు ఇచ్చి స్వాగతం
బెయిల్‌ పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన వారికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు,ఆదిరెడ్డి వాసు విడుదలయ్యారు. బెయిల్‌ పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన వారికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్షాల గొంతులు నొక్కడానికి ఎక్కడికక్కడ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని విమర్శించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాను బంధువుల తరుపున మాట్లాడటం లేదని సాక్షాత్తు సాక్షాలు ఏవని కోర్టే ప్రశ్నించిందని అన్నారు.జగన్‌ చుట్టూ ఉన్న సీనియర్లు కూడా అక్రమ కేసులపై మాట్లాడటం లేదని రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఆలోచించడం లేదని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story