పొత్తులపై మరోసారి క్లారిటీ

ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చిచెప్పారు. వైసీపీని కచ్చితంగా గద్దె దింపడం ఖాయమని స్పష్టంచేశారు. పొత్తులు అనేవి పార్టీ ఎదుగుదలకు దోహదపడుతుందని.. తక్కువ అంచనా వేయొద్దని జనసేన క్యాకర్తలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మన బలమేంటో ముందుగా బేరీజు వేసుకోవాలన్నారు.
ఏంచేసినా నిర్మాణాత్మకంగా చెయ్యాలని చెప్పారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని పవన్ తెలిపారు. వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేదని చెప్పారు. తమకు ఉమ్మడి ప్రత్యర్థి వైసీపీనేనని తేల్చిచెప్పారు. అవసరమైతే తగ్గడమే కాదు.. అవసరం వచ్చినపుడు బెబ్బులిలా తిరగబడాలన్నారు. వైసీపీకి జనసేన అంటే ఎందుకు భయమని అధికార పార్టీని ప్రశ్నించారు. డిసెంబర్‌లో ఎన్నికలు రావడం ఖాయమన్న పవన్.. జూన్ నుంచి ప్రజల్లో తిరిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com