చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్
చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. డీసీసీ అధ్యక్ష పదవికి డాక్టర్ సురేష్‌బాబు రాజీనామా చేశారు. సురేష్‌బాబు రాజీనామాను ఏపీసీసీ ఆమోదించింది

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. డీసీసీ అధ్యక్ష పదవికి డాక్టర్ సురేష్‌బాబు రాజీనామా చేశారు. సురేష్‌బాబు రాజీనామాను ఏపీసీసీ ఆమోదించింది. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సురేష్‌బాబు టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకు మార్గం సుగమం అయ్యిందని సమాచారం. సురేష్‌బాబు టీడీపీలో జాయిన్ అయితే కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దొరస్వామినాయుడు కుమారుడైన సురేష్‌బాబు.. గతంలో 2 సార్లు కాంగ్రెస్ తరుపున కుప్పం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వివాద రహితుడు, సౌమ్యుడుగా పేరు ఉండడడంతో సురేష్‌బాబు రాక పట్ల టీడీపీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story