Viveka Murder Case : "పనులున్నాయ్... మరో 4రోజులు రాలేను"

Viveka Murder Case : పనులున్నాయ్... మరో 4రోజులు రాలేను

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి డుమ్మా కొట్టారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని.. అంతుకే విచారణకు హాజరు కాలేనని తనకు నాలుగు రోజులు గడువు కావాలంటూ సీబీఐకు లేఖ రాశారు. అయితే అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి ని తిరస్కరించడంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు వివేక హత్య కేసులో అవినాశ్‌కు 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయం ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం హజరవుతానన్న ఆయన హఠాత్తుగా మనుసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలు దఫాలుగా విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో అవినాశ్ పిటిషన్ వేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. వివేకా హత్య కుట్రలో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై అఫిడవిట్‌లో సీబీఐ క్లారిటీగా తెలిపింది.ఈ కేసులో 20 రోజుల తర్వాత సీబీఐ మరోసారి అవినాశ్‌కు నోటీసులు జారీ చేసింది.

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పై బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ వాదించింది. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది.సీబీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అవినాశ్ అరెస్ట్ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story