మహా ఉద్యమంగా లోకేష్‌ యువగళం

మహా ఉద్యమంగా లోకేష్‌ యువగళం
టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. ఎక్కడికక్కడ నారా లోకేష్‌కు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేష్‌తో అన్నీవర్గాల ప్రజలు కలిసి నడుస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్.. దారి పొడువునా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. హామీలు ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. జై లోకేష్‌.. జై టీడీపీ నినాదాలతో లోకేష్‌ పాదయాత్ర పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి.

ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 103వ రోజు యాత్రలో భాగంగా మధ్యాహ్నం 2గంటలకు నంద్యాల యాతం ఫంక్షన్‌ హాల్‌ వద్ద రైతులతో లోకేష్‌ ముఖాముఖిలో పాల్గొననున్నారు. 13 వందల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుండటంతో సాయంత్రం 4 గంటలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. 4.45కి కానాలలో జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమవుతారు. 5.45కి హెచ్‌ఎస్‌ కొట్టాలలో స్థానికులతో భేటీ అవుతారు. అదేవిధంగా 6.55కి జూలపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులతో సమావేశమై వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. రాత్రి 7.45కి పసరుపాడు, 9.30కి తెల్లాపూరి ప్రజలతో లోకేష్‌ భేటీ అవుతారు. 10.05కి రాయపాడులోని స్థానికులతో సమావేశం తర్వాత 10.55కి రాయపాడు శివారు విడిది కేంద్రం వరకు లోకేష్ పాదయాత్రను కొనసాగించనున్నారు.

యువగళం మహా ఉద్యమంగా మారిందన్నారు నారా లోకేష్‌. ఒక్క అడుగుతో జగన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. నంద్యాల బహిరంగ సభలో జగన్‌ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దండయాత్రేనని వార్నింగ్ ఇచ్చారు. లక్ష కోట్ల ప్రజాధనం కొట్టేసినవాడు పేదవాడా అని ప్రశ్నించారు. జగన్ దేశంలోనే ధనిక సీఎం అని.. రాష్ట్రం మాత్రం అప్పుల్లో నంబర్‌ వన్‌గా ఉందన్నారు. చంద్రబాబువి అంబేద్కర్ చట్టాలు.. జగన్‌వి బ్రిటిష్ చట్టాలని ఫైరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story