Yuvagalam : అశేష జనవాహిని మధ్య లోకేష్ పాదయాత్ర

Yuvagalam : అశేష జనవాహిని మధ్య లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆదోని నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో ఆదోని దద్దరిల్లింది. లోకేష్‌ పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఇవాళ 77వ రోజు పాదయాత్రలో లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు.. ఓ వైపు భుజం నొప్పి బాధిస్తున్నా అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం యువగళం పాదయాత్ర సిరిగుప్ప క్రాస్‌ దగ్గర 1000 కిలోమీటర్ల మార్క్‌ను దాటనుంది ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు లోకేష్‌.ఇక లోకేష్‌ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్‌ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ఆదోని బైపాస్‌ క్రాస్‌ వద్ద స్థానికులతో సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు. ఆ తరువాత ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ జేఏసీతో మాటామంతీ నిర్వహించనున్నారు. అలాగే స్థానిక దర్గా దగ్గర ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సాయంత్రం కడి కొత్త క్రాస్‌ దగ్గర బహిరంగ సభ లో పాల్గొని ప్రసంగించనున్నారు లోకేష్.


Tags

Read MoreRead Less
Next Story