AP : చంద్రబాబు పర్యటనతో అధికారుల గుండెల్లో రైళ్లు

AP : చంద్రబాబు పర్యటనతో అధికారుల గుండెల్లో రైళ్లు
X

తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చంద్రబాబు డెడ్‌లైన్‌తో అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది. తడిసిన ధాన్యంపై ఇప్పటికి దృష్టి పెట్టారు. నిడదవోలు మండలం తీరుగూడెంలో హుటాహుటిన తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్నారు, గత రాత్రి నుంచి రైతులను మభ్యపెడుతూ ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపిస్తున్నారు. నిన్నటి వరకు కదలని యంత్రాంగంలో.. చంద్రబాబు రాకతో రాత్రికి రాత్రే చలనం వచ్చింది,. గత 20 రోజుల నుంచి రైతులను అధికారులు.. కన్నెత్తి చూడలేదు. నిన్నటి వరకు గోనె సంచులు, ట్రాన్స్‌పోర్ట్‌ లారీలు, ట్రాక్టర్లు కూడా దొరకలేదు. తాజాగా రైతు భరోసా కేంద్ర సిబ్బంది, వాలెంటీర్లు దగ్గరుండి.. ధాన్యాన్ని తరలిస్తున్నారు.

Tags

Next Story