కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..7గురు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..7గురు మృతి
కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద లారీ, తుఫాను వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద లారీ, తుఫాను వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. తాడిపత్రి ప్రాంతానికి చెందిన వ్యక్తులు తుఫాను వాహనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి వైపు నుంచి వస్తున్న లారీ తుఫాను వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో తూఫాన్‌లోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా తాడిపత్రి, బళ్లారి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఏడుగురిని అనంతపురం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో మేఘనా రెడ్డి, శిల్పారెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, జయలక్ష్మి, వెంకటలక్ష్మి, చికిత్స పొందుతున్నారు.. బళ్లారికి చెందిన 13 ఏళ్ల బాలుడు దీక్షిత్ సురక్షితంగా బయటపడ్డాడు.

ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోయాయి. అతివేగంతో పాటు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనంలో మొత్తం 16 మంది ఉన్నట్లు బంధువులు తెలిపారు. తెల్లవారుజామున కావడం, అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story