గుడివాడ రోడ్లన్నీ పసుపుమయం..రాము ఎంట్రీతో దద్దరిల్లిన రోడ్లు

గుడివాడ రోడ్లని పసుపుమయంగా మారాయి. టీడీపీ పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము ఎంట్రీతో వేలాదిగా జనం కదిలొచ్చారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు దద్దరిల్లిపోయింది. అడుగడుగునా వెనిగండ్ల రాముకు హారతులిస్తూ మహిళలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు పెద్దఎత్తున వెనిగండ్ల రాముపై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలందించారు.అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ,వారితో మమేకమవుతూనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల గుడ్ మెన్ పేటలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.తాజాగా రైల్వే స్టేషన్ రోడ్డులో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి అంతకు మించిన స్థాయిలో ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మాత్రమే వెనిగండ్ల రాము పరిమితం కావడం లేదు...అధికారంలో లేకున్నా తనదైన శైలిలో కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com